CM Chandrababu: అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.. దీనిపై సీరియస్‌గా స్పందించారు సీఎం చంద్రబాబు. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు.. అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు..
Read Also: Mallu Bhatti Vikramarka: సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి
ఇక, పింఛన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి అని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. పింఛన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి భోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు.. ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రుల నుంచే ఈ భోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పింఛన్లు ఉంటే అందులో 78 వికలాంగ పింఛన్లే.. 78 ఫించన్ దారులను పరిశీలిస్తే అందులో 22 మందే అర్హులుగా తేలింది.. అనర్హులైన 56 మందిలో 27 మంది విచారణకు కూడా రాలేదని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు..