Site icon NTV Telugu

Stree Shakti Scheme: స్త్రీ శక్తి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలకు మరో గుడ్ న్యూస్‌

Cbn

Cbn

Stree Shakti Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 తేదీన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కలిగించే స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. దీంతో, ఎంపిక చేసిన బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపు చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గుర్తించారు.. సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు.. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం చేసి.. రూ.19 కోట్ల లబ్ది పొందినట్టు సీఎం చంద్రబాబు నిర్వహించిన రివ్యూ సమావేశంలో అధికారులు … సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు.. గుర్తింపుకార్డు ప్రతీసారి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపినా ఉచిత ప్రయాణానికి ఓకే అని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దీంతో, మహిళలకు మరింత వెసులుబాటు కలిగించినట్టు అయ్యింది..

Read Also: Honor X7c 5G: IP64 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో కొత్త హానర్ స్మార్ట్ ఫోన్ లాంచ్!

కాగా, రూ. 2.02 కోట్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం కోసమే ఈ పథకం తెచ్చామని.. స్త్రీ శక్తి స్కీమ్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటాం.. స్వర్ణాంధ్ర 2047 ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ఉండాలని తీసుకొచ్చాం.. ఆడబిడ్డలకు మంచి చేయడం నా పూర్వజన్మ సుకృతం.. ఆగష్టు 15న స్త్రీ శక్తి ప్రారంభించడానికి కారణం మహిళల స్వాతంత్ర్యం.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం మహిళలకు ఇచ్చాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్‌.. అని గర్వంగా చెపుతున్నా.. నేను, పవన్, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి లేదని చెప్పారు పవన్ కళ్యాణ్.. గత ఐదేళ్ళలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇక, రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డలను అవమానించిన అంశంలో నేను, పవన్ బాధితులమే.. క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసినా వదిలిపెట్టాం.. ఎవరైనా తోక తిప్పితే తోక కట్ అయిపోతుంది.. ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తేవడానికి వెనుకాడం అన్నారు. ఆడబిడ్డలపై గతంలో తలిదండ్రులు కూడా వివక్ష చూపించేవారు.. భర్తకు పర్మిషన్ అక్కర్లేదు.. భార్యకు పర్మిషన్ కావాలి.. ఇదేక్కడి న్యాయం అని పేర్కొన్నారు. కడుపున పుట్టిన పిల్లలూ ఆడవారికి ఏమీ తెలీదనే వారు.. అవి చూసి పుట్టిన ఆలోచనే డ్వాక్రా సంఘాలని చంద్రబాబు చెప్పుకొచ్చిన విషయం విదితమే..

Exit mobile version