NTV Telugu Site icon

CM Chandrababu: ఆరు నూతన పాలసీలతో రాష్ట్ర అభివృద్ధి మారుతుంది..

Chandrababu

Chandrababu

రాష్ట్ర అభివృద్ధికి ఆరు నూతన పాలసీలు రూపొందించామని.. ఈ నూతన పాలసీలతో ఒక గేమ్ ఛేంజర్‌గా ఏపీ అభివృద్ధి మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఏపీ గ్రీన్ ఎనర్జీ 4.0, టూరిజం, ఐటీ విధానాలలో పాటు అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చారు. ఏపీలో ఉండే యువత ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్లాలి.. మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ప్రపంచానికి అనుసంధానం కావాలని చంద్రబాబు కోరారు. 25 సంవత్సరాల క్రితం ఐటీ పాలసీ తీసుకొచ్చాం.. అనేక కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. హైటెక్ సిటీ కట్టాం.. అక్కడినుండి ఆన్‌స్టాపబుల్‌గా అభివృద్ధి సాధించామని సీఎం తెలిపారు. భారతదేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లి అనేక రంగాల్లో పనులు చేస్తున్నారు.. ఈరోజు మనం తీసుకున్న ఆరు పాలసీలు భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొస్తాయని.. రాష్ట్ర ప్రగతిని మారుస్తుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి.. పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వారిని గౌరవించాలి.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. ఇంటిగ్రిటీ హానెస్టితో వ్యాపారాలు చేసి సౌధాలు నిర్మించవచ్చని సీఎం చెప్పారు. ఆ విషయాన్ని రతన్ టాటా రుజువు చేశారు.. రతన్ టాటా నీతి నిజాయితీగా వ్యాపారం చేశారు.. యువతకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తాం.. ఐదు జోన్లకు 5 ఇన్నోవేషన్ హబ్ వస్తాయన్నారు. రతన్ టాటా పేరుతో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ హబ్ చూసి యువత స్ఫూర్తి పొందాలని చంద్రబాబు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పానని సీఎం చెప్పారు. అభివృద్ధి జరగాలి.. పరిశ్రమలు రావాలి.. సంపద సృష్టించబడాలి.. ఆ సంపద పేద ప్రజలకి అందాలి.. దానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.

Heavy Rains: తిరుమలలో భారీ వర్షాలు.. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేత

అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటే.. నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరిగి తీరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆక్వా కల్చర్‌లో ప్రపంచంలో ఏపీ నెంబర్ వన్‌గా తయారవుతుంది.. ప్రతి ఫ్యామిలీ నుండి ఒక పారిశ్రామికవేత్త అభివృద్ధి చెందేలా ఎంఎస్ఎం విధానంలో ప్రాధాన్యత ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ అంటే రాళ్ళసీమగా ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు గేమ్ చేంజర్‌గా మార్చామని సీఎం పేర్కొన్నారు. అనంతపురం ఎడారిగా మారిపోతుంది అనుకుంటున్న సమయంలో హార్టికల్చరల్ హబ్‌గా మార్చాం.. కృష్ణా జలాలను, రాయలసీమకు ఇవ్వాలని చెప్పింది ఎన్టీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాలసీమగా తయారు చేస్తాం.. పోలవరం పూర్తయితే నదులు అనుసంధానం జరిగే రాయలసీమ రత్నాల సీమ మారుతుందని చంద్రబాబు అన్నారు. మరోవైపు.. విశాఖను బెస్ట్ సిటీగా తయారు చేస్తాం.. పదివేల ఎకరాలతో ఇండస్ట్రియల్ హబ్ తయారు చేస్తాం.. తీర ప్రాంత అభివృద్ధి విశాఖ నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. విశాఖ నుంచి భావనపాడు వరకు తీర ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

Smartwatches: తక్కువ ధరలో మంచి స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? ఇవి ట్రై చేయండి..

స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్‌లో అనేక సంస్కరణ తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాధ్యతాయుతంగా, పారదర్శకంగా అనుమతులు ఇచ్చేలా చర్యలు ఉంటాయి.. అనేక రంగాల్లో సబ్సిడీలు ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ప్రభుత్వ ఆలోచన.. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఉపయోగించుకొని ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చెందాలని అన్నారు. ఎంఎస్ఎం మ్యానుఫ్యాక్చరర్స్‌కు 75% వరకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే.. బలహీనవర్గాలను అభివృద్ధి బాటలో నిలుపుతాం.. నూతన పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.