Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా

  • పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
  • పాల్గొన్న ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు..
  • పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్‌పై ఆరా
Cbn

Cbn

Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో తాజా పరిణామాలు చర్చించారు చంద్రబాబు.. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా తీశారు. రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని.. నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబు కు వివరించారు.. ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి… 1402 లోడ్లు డిస్పాచ్‌ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపారు అధికారులు. గత అర్థరాత్రి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు 2173 కిలో లీటర్ల పెట్రోల్, 2846 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని తెలిపారు అధికారులు.

Read Also: Nashik TCS Case: నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!

అయితే, స్టాక్ లేని బంకుల సంఖ్య ఎంత మేర ఉందని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి… నిన్నటితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయని అధికారులు వివరించారు.. ప్రస్తుతం జిల్లాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత ఉందన్న అధికారులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేంత వరకు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. క్యూలైన్లు లేకుండా చూడాలన్న సీఎం.. అవసరమైతే టోకెన్, స్లాట్ సిస్టంలను పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.