Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ బీపీవో కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కీలక విచారణ ముగిసింది. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ తీర్పుపైనే నిలిచింది. ఈ కేసులో మతమార్పిడి ప్రయత్నం, మత మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు పేర్కొనబడింది. కేసు మొదటి నుంచే వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు బెయిల్ విచారణతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అజయ్ మిసర్ను నియమించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తున్నారు. గతంలో మాలేగావ్ పేలుళ్లు, పీఎఫ్ఐ, ముంబై పేలుళ్లు వంటి హైప్రొఫైల్ కేసుల్లో ఆయన వాదనలు వినిపించిన అనుభవం కలిగి ఉన్నారు. నిదా ఖాన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం కూడా ఉందని వాదించారు. అందువల్ల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు.
ఇక, బాధితుల తరఫు న్యాయవాదులు కూడా బెయిల్‌కు వ్యతిరేకంగా జోక్య పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిందితురాలికి ఉపశమనం కల్పించడం న్యాయ ప్రక్రియను దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఉపశమనం ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మే 2న వెలువడే కోర్టు తీర్పు ఈ కేసులో కీలక మలుపు కానుంది. బెయిల్ మంజూరు చేస్తారా? లేక తిరస్కరిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నిర్ణయం నిందితురాలి భవిష్యత్తుతో పాటు కేసు దర్యాప్తు దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!