Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రబావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు.. ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Read Also: Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. ప్రశాంత్ నీల్ ఇలా చేశావేంటి..?

భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న ఆయన.. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని స్పష్టం చేశారు.. అయితే, దక్షిణ. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు సీఎం చంద్రబాబు వివరించారు కలెక్టర్లు.. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సూచించారు.. ఇక, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు.. పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version