NTV Telugu Site icon

CM Chandrababu: ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం..

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు.. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు.

Read Also: Harish Rao : గ్రామ సభల్లో విడుదల చేస్తున్న అర్హుల జాబితాకు ఉన్న విలువ ఏంది?

నాలుగు రోజుల దావోస్ టూర్ తర్వాత.. ఒక రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఆ తర్వాత ఈరోజు అమరావతికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి వచ్చారని.. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబును కలుస్తున్నారు. నాలుగు రోజుల దావోస్‌ పర్యటన సందర్భంగా ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం పాల్గొన్నారు. ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సదస్సుల్లో బిజీబిజీ గడిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను సీఎం వివరించారు.

Read Also: Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల..