Site icon NTV Telugu

CM Chandrababu: ఐటీని ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యాను.. అప్పుడు మైక్రోసాఫ్ట్- ఇప్పుడు గూగుల్!

Babu

Babu

CM Chandrababu: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లలో 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఈరోజు ( డిసెంబర్ 23న) ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీ ప్రాధాన్యతపై ప్రధానంగా చర్చించారు.

Read Also: iPhone Offers: ఐఫోన్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్స్

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను సక్సె్స్ అయినట్లు తెలిపారు. 1998లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు రప్పించాం.. ఇప్పుడు (2025) విశాఖకు గూగుల్ సంస్థను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గూగుల్ 15 బిలయన్ డాలర్ల పెట్టుబడులను వైజాగ్ లో పెట్టనుందన్నారు. ఇక, ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం.. క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు ఇస్తామన్నారు. వ్యక్తిగత ఔషధాలు, ప్రివెంటివ్, క్యురేటివ్ హెల్త్‌ను క్వాంటం అప్లికేషన్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది.. సామర్ధ్యాలు, వేగం, కచ్చితత్వం లాంటివి క్వాంటం టెక్నాలజీ ద్వారా సాధించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు..?

ఇక, ఓ ట్రాన్సఫర్మేషనల్ ఛేంజ్ క్వాంటం ద్వారా సాధించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ను భారతీయులు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. ఏ సాంకేతికత అయినా విప్లవమైనా ఏపీ సారథ్యం వహిస్తుంది.. ఎవరినీ అనుసరించదని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా వచ్చే రెండేళ్లలో అమరావతి నుంచే ఉత్పత్తి చేస్తున్నాం.. క్వాంటం నిపుణులు, క్వాంటం కంప్యూటర్లు, పరికరాలను ఏపీ నుంచే ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందిస్తామని చెప్పారు. నవంబర్ 13వ తేదీన ఇచ్చిన క్వాంటం ప్రోగ్రామ్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.. క్వాంటం నిపుణుల్ని తయారు చేసేందుకు ఇచ్చిన ఒక్క ప్రకటన ద్వారా 54 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version