CM Chandrababu: రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ అర్ధం కావాలంటూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో కమర్షియల్ టాక్స్ చూశాను.. తర్వాత వ్యాట్ వచ్చింది.. వేరే రాష్ట్రంలో నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ టాక్స్ ఉండేది.. టాక్స్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయిందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జీఎస్టీ ప్రవేశ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు.. అయితే, రిఫామ్స్ అంటే నేను ముందుంటాను. ఎలాంటి రిఫామ్స్ అయినా ముందుకే.. అభివృద్ధి జరిగితే సంపద వస్తుందని తెలిపారు.. ఇది వరకు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం కేటగిరీలో ఫోర్ ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. అనేక రకాలుగా కాంప్లికేషన్ లు ఉండేవి. 140 కోట్ల మందికి కొత్తగా తెచ్చిన 5 శాతం, 18 శాతం ట్యాక్స్ వల్ల లాభం కలుగుతుందని వివరించారు.
Read Also: Vizianagaram : తరగతి గదులు లేక చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు.. విజ్ఞానానికి ఆటంకం
దసరా.. దీపావళి ఘనంగా చేసుకోడానికి పేదవారికి అవకాశం ఉంటుంది.. గణనీయంగా ట్యాక్స్ తగ్గుతుందన్నారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంపద. సంక్షేమం వస్తాయి.. టాక్స్.. రిఫామ్స్ అంటే కొందరు వెనకడుగు వేస్తారు.. వన్ నేషన్.. వన్ విజన్ తో ముందుకు వెళ్లాలి.. ప్రపంచంలో డబుల్ డిజిట్ గ్రోత్ గా భారత్ ఉంటుందన్నారు.. జీఎస్టీ రెండో తరం సంస్కరణలు మోడీ తీసుకువచ్చారు.. నిత్యావసర వస్తువులు మిల్క్, పన్నీర్, పెరుగు 5 శాతం తగ్గాయి.. కామన్ మాన్ కు ఉపయోగ పడేవి అన్ని తగ్గుతాయన్నారు.. దేశంలోనే తొలిసారి జీఎస్టీ 2.0 సంస్కరణలపై తీర్మానంపై చర్చించింది ఏపీ శాసనసభ.. గతంలో సీఎస్టీ, వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది. 17 రకాల పన్నులు , 13 రకాల సెస్సులు, సర్‌ఛార్జీలు ఉండేవి. ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పన్నులు వేసే పరిస్థితి ఉండేది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగేలా జీఎస్టీలో రెండు స్లాబులతో సంస్కరణలు తీసుకువచ్చింది.. రెండు శ్లాబులతో పన్నుల వ్యవస్థను మరింత సరళతరం చేశారని తెలిపారు చంద్రబాబు.
జీఎస్టీ అమలు దేశంలో ఓ గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్నారు చంద్రబాబు.. సంపద సృష్టించని వారికి సంక్షేమం చేసే అధికారం లేదన్న ఆయన.. కేంద్రం తీసుకువచ్చిన ఈ సంస్కరణలతో ముందుగానే దీపావళి, దసరా పండుగల బోనస్ ఇచ్చారని ప్రశంసించారు.. 99 శాతం మేర వస్తువులన్నీ 5 శాతం పన్ను పరిధిలోకే వచ్చాయి. పేద మధ్యతరగతి ఇలా అందరికీ లబ్ది కలుగుతుంది.. ఈ రిఫార్మ్స్ వల్ల పన్ను చెల్లింపు దారుల సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. అలాగే జీఎస్టీ వసూళ్లు 22 లక్షల కోట్లకు పెరిగాయన్నారు.. వన్ నేషన్ – వన్ ట్యాక్స్ అనే విధానం సక్రమంగా అమలు కావటం వల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు.. నిత్యావసర వస్తువులు సబ్బులు, టూత్ పేస్టు, షాంపులు, నెయ్యి లాంటి వస్తువులన్నీ 5 శాతానికి వచ్చాయి.. ఏసీలు, ఫ్రిడ్జ్‌ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి.. జీవిత భీమా, ఆరోగ్య భీమాలకు కూడా జీఎస్టీ సున్నా శాతానికి వెళ్లింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రూ.750 కోట్ల వరకూ ఏపీకి ఆదా అవుతుంది.. అగ్రిటెక్ యంత్రాలకు కూడా గణనీయంగా పన్ను తగ్గింది.. రైతులకు ప్రయోజనం కలుగుతుంది.. ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల ధరలు కూడా 5 శాతం శ్లాబ్ లోకి వచ్చాయి. నిర్మాణ రంగం పుంజుకుంటుంది. సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునేలా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై జీఎస్టీ తగ్గింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఈ జీఎస్టీ ప్రయోజనాలు దక్కాలి.. చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ అంశాలు తెలియాలని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
