Site icon NTV Telugu

CM Chandrababu: కాసేపట్లో అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన..

Babu

Babu

CM Chandrababu: కాసేపట్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటికి శంకుస్థాపన జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 9న) ఉదయం 8.51 గంటలకు భూమి పూజ చేయనున్నారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టువస్త్రాలు అందించనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో సీఎం చంద్రబాబు నివాసం నిర్మాణం జరగనుంది. నందమూరి, నారా కుటుంబాల సమక్షంలో ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం కొనసాగనుంది. 5 ఎకరాల స్థలంలో సీఎం నివాసం.. పక్కనే కాన్ఫెరెన్సు హాల్ నిర్మాణం కూడా నిర్మిస్తున్నారు. ఏడాదిన్నర సమయంలో నిర్మాణం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version