Podili Police – Trader Clash: వ్యాపారితో పోలీసుల ఘర్షణ.. సీఎం సీరియస్, చర్యలకు ఆదేశాలు
- పొదిలిలో వ్యాపారితో పోలీసుల ఘర్షణ ఘటనపై చర్యలకు సీఎం ఆదేశాలు..
- పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు డీజీపీకి స్పష్టీకరణ..
- ఇప్పటికే ఎస్ఐను వీఆర్ కు పంపామని తెలిపిన అధికారులు..
- ప్రజల గౌరవానికి భంగం కలిగేలా ఎవరూ ప్రవర్తించకూడదన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Podili Police – Trader Clash: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి పట్టణంలో అవినాష్ అనే వ్యాపారికి, పట్టణ ఎస్సై వేమనకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్‌లోడ్ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడ నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో వివాదం రేగింది. తరువాత రోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎస్ఐపై ఆరోపించారు.
Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
దీనిపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వక్తం చేస్తూ ఆందోళన చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపుతూ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగలపూడి అనితతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని వివరించారు. సదరు పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ కు ముందుగా ఛార్జ్ మోమో ఇచ్చి వివరణ తీసుకున్నామని… ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపామని డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని… సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?