NTV Telugu Site icon

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్ర.. పవన్‌కు అభినందనలు..

Babu

Babu

CM Chandrababu: 2024 ఎన్నికలు ఒక చరిత్ర.. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్రగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓటు వేయమని చెప్పాం.. పని చేసే వారికే గెలుపు వరిస్తుంది. జనసేన తరపున పవన్ కల్యాణ్‌కు అభినందనలు.. బీజేపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేశారని పేర్కొన్నారు.. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు.. అమరావతి స్మశానం అన్నారు.. రాజధాని పేరుతో ముడుముక్కలాట ఆడారని వైసీపీపై మండిపడ్డారు..

Read Also: Tamannah- Vijay Varma: తమన్నా ప్రేమ పెటాకులు?

ఇక, విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని మోడీ ఫౌండేషన్ వేశారు.. ప్రధాని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేశారని గుర్తుచేశారు చంద్రబాబు.. 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కలిసి కట్టుగా ఉంటే ఏ పార్టీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు.. ఎమ్మెల్యేలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.. కూటమిలో ఒకరో.. ఇద్దరో.. వైసీపీతో కలిసి పని చేస్తున్నారు. ఆ సందర్భంగా నేను వైసీపీకి పనులు చెయ్యద్దు అని మాట్లాడాను.. కానీ, నా మాటలు వక్రీకరించారని మండిపడ్డారు..