Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యం.. మరోసారి విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, కల్పించే వసతులపై వివరిస్తూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నారు.. ఇక, మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధం అయ్యారు సీఎం చంద్రబాబు.. వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా లండన్ లో పర్యటించనున్నారు.. అయితే, వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు కోసం లండన్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు.. సీఎం చంద్రబాబుతో పాటు లండన్ వెళ్లనున్నారు.. సీఎం కార్యదర్శి కార్తికేయమిశ్ర.. సీఎం లండన్ టూర్ కు సంబంధించి జీఎడీ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని

Exit mobile version