Site icon NTV Telugu

CM Chandrababu: వారికి గుడ్‌న్యూస్‌.. ఇవాళే అందనున్న సొమ్ము

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది.. కొన్నిసార్లు అయితే, ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసి సందర్భాలు లేకపోలేదు.. గతంతో ఉన్న పెన్షన్ల సొమ్ము పెంచి మరి.. లబ్ధిదారులకు అందజేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఇక, సెప్టెంబర్‌లోకి అడుగుపెట్టడంతో.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు..

Read Also: US: హూస్టన్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. నదులు తలపిస్తున్న రహదారులు

ఇక, ప్రతి నెలా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతీసారి ఏదో ఒక జిల్లాకు వెళ్లున్నారు.. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందిస్తూ.. వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.. ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు… అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. వృద్ధులకు, వికలాంగులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తారు.. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాజంపేటకు చేరుకుంటారు.. తాళ్లపాకలో ప్రజా వేదికలో పాల్గొంటారు సీఎం.. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశంకానున్నారు సీఎం చంద్రబాబు.. సాయంత్రం 6 గంటలకు తాళ్లపాక నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు..

Exit mobile version