Site icon NTV Telugu

CM Chandrababu: రేపు టీడీపీ కీలక సమావేశం.. తాజా పరిణామాలపై చంద్రబాబు ఏం చేస్తారు..?

Cbn

Cbn

CM Chandrababu: రేపు ఉండవల్లిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కీలక సమావేశం జరగనుంది… టీడీపీలో ముఖ్య నేతలు.. పొలిట్‌బ్యూరో సభ్యులు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొననున్నారు.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది.. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరోలో మార్పులు ఉండనున్నాయి. రాష్ట్ర కమిటీకి ముందు జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు.. ముగ్గురు సభ్యులతో జిల్లా కమిటీలు వేయనున్నారు.. ఈ అంశాలపై చర్చ జరగనుంది.

Read Also: Fake CBI Officers crime: ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం.. రూ.2.5 కోట్లతో జంప్

అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల వైఖరిపై చర్చ జరుగుతోంది..కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో ఇర్రుకుంటున్నారు. .సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయ్యారు… రేపు జరిగే సమావేశంలో కూడా మంత్రులు.. ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది… ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేల వైఖరి రిపీటెడ్ గా ఇలా ఉంటే.. ఇటు ప్రభుత్వం అటు పార్టీకి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉందనే చర్చ బాగా జరుగుతోంది.. ఇలాంటి సమయంలో కీలక సమావేశం జరగడంతో సీఎం చంద్రబాబు నేతలకు గట్టిగా చెప్పనున్నారు.. జిల్లా ఇంఛార్జి మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యత అప్పగించనున్నారు.. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే ఇబ్బంది పడే పరిస్థితి ఉండడంతో సీఎం చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.

Read Also: అదిరిపోయే అందాలతో మతి పోగొడుతున్న కావ్య థాపర్…

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం ముందుకెళుతున్నారు సీఎం చంద్రబాబు.. పార్టీకి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.. ఎమ్మెల్యేలకు కూడా ఇదే విషయం చెప్పమన్నారు.. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో అయినా ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని.. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ జనంలోకి వెళ్లేలా కీలకపాత్ర పోషించాలని కూడా ఈ సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తోంది… టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు.. సీనియర్ నేతలు… మంత్రులు ఎమ్మెల్యేలు.. అందరు కూడా పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పనున్నారు సీఎం చంద్రబాబు.. జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి వెళ్ళే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా రేపు జరిగే సమావేశంలో చెప్పనుమనట్టు సమాచారం.. ఎందుకంటే పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తే కార్యకర్తలకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవైపు పార్టీ.. మరోవైపు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పాలన మీద దృష్టిపెట్టే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.. అందులో భాగంగానే రేపు జరిగే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది.. దీంతోపాటు ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి కూడా మంత్రులకు దిశా నిర్దేశం చెయ్యనున్నారు.. నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఉంటే అక్కడే క జిల్లా మంత్రుల సమక్షంలో పరిష్కార మార్గం ఆలోచించే విధంగా కూడా రేపు కొన్ని కీలక సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది…

Exit mobile version