NTV Telugu Site icon

CM Chandrababu: సీఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్ష.. ప్రధాని మోడీ పర్యటనపై చర్చ..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. దానికి కేబినెట్‌ సమావేశ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఇవాళ సీఆర్డీఏ అధికారుల‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయ‌ణ‌తో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.. ప్రధాని న‌రేంద్ర మోడీ అమ‌రావ‌తి ప‌ర్యట‌న‌పై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.. అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప‌ర్యట‌న.. రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన స్థలం ఎంపిక‌, ముహూర్తం, ఇత‌ర ఏర్పాట్లపై అధికారుల‌తో సీఎం ప్రిలిమిన‌రీ స‌మావేశం నిర్వహించారు..

Read Also: Junaid Jaffer: రంజాన్ ఉపవాసం ఎఫెక్ట్?.. క్రికెట్ ఆడుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్లేయర్ మృతి..

ఈ సమావేశంలో రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన ముహూర్తం ఖరారు చేయడంతో పాటు.. రాజధాని శంఖుస్థాపన అనే అంశం కాకుండా నిర్మాణ పనులు ప్రారంభం అని చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. రాజధాని పనుల రీ లాంచ్ కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచే ప్రతిపాదనలపై కూడా ఈ సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది..