Polavaram Project Action Plan: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి అధికారులు ఇచ్చిన యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలు నిర్దేశించారు.. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం గ్యాప్ -1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ -2తో పాటు మిగతాపనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ.. జులై నాటికే వాటిని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఫిబ్రవరి 2027 నాటికి పూర్తి చేయగలమని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ.. 2026 జూలై నాటికి పూర్తయ్యేలా చూస్తామన్నారు.. పోలవరం కుడి కాలువ పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రం వాల్ 2025 జనవరి నుంచి ప్రారంభమై 2026 ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని అంచనాతో ఉన్నప్పటికీ 2025 డిసెంబర్ నెలకే వాటిని పూర్తిచేయాలని ఆదేశించారు.. 2026 ఆగస్టు నాటికి ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ కొంత మేర పూర్తవుతుంది కాబట్టి.. కాపర్ డ్యాం వద్ద నీరు నిలువ చేసి గ్రావిటీ ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా నీరు ఇచ్చే ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు..
Read Also: Winter: చలికాలంలో హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
మొత్తంగా.. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని పనులను ముందుగానే పూర్తి చేయాలని లక్ష్యాలను సీఎం నిర్దేశించారు..ఇక, ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం ప్రాజెక్టు రెండు కళ్లు లాంటివని ఆయన అన్నారు. అటువంటి కళ్లను కొందరు దుర్మార్గులు పొడిచేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఉదయం పదకొండు గంటలకు రావాల్సిన ఆయన గంట ఆలస్యంగా ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. మొదటపోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. తరువాత పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలిపాడ్ కు చేరుకుని, హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిశీలించారు. ప్రాజెక్టు పనుల గురించి సీయంకు అధికారులు వివరించారు. అక్కడ నుంచిరోడ్డు మార్గాన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబునాయుఢు.. డయాఫ్రం వాల్ గైడ్ వాల్ పనులు తీరు పరిశీలన చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ గెస్ట్ హౌస్ కు చేరుకున్న సీఎం, ప్రాజెక్టు పనులను ఏ విధంగా వేగవంతం చేయాలనే అంశంపై అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష చేశారు. పనుల పురోగతికి సంబంధించి ఆయన దిశా నిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లులాంటివన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందన్నారు.
Read Also: Arvind Kejriwal: బీజేపీని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్‌కు ఆయుధం దొరికింది?.. అదేంటంటే?
అప్పట్లో మొత్తం మీద 72 శాతం పనులు చేసామన్నారు సీఎం చంద్రబాబు. అటువంటి ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసిందని, రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేసారన్నారు. వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేసారన్నారు. దెబ్భతిన్న డీ వాల్ ను కట్టాలంటే 2400 కోట్లు అదనంగా అవుతుందన్నారు. కేంద్రం పోలవరం కు ఇచ్చిన నిధులను మళ్ళించారని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ వర్క్స్ 71.3 శాతం మేం చేస్తే, వారు కేవలం 3.5 శాతం మాత్రమే చేసారని సీయం గుర్తు చేసారు. 12,150 కోట్లను మొదటిదశ పనుల నిమిత్తం కేంద్రం మంజూరు చేసిందని, వాటిలో 2150 కోట్లు నిధులను విడుదల చేసారన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. వచ్చే ఏడాదిజనవరి 2 న డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తామని, 2026 మార్చి నాటికి పూర్తవుతాయని అధికారులు అంటున్నారని, 2025 డిసెంబర్ నాటికు డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాలి అని నేను అంటున్నానన్నారు. 2027 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారని, 2026నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని వారికి స్పష్టం చేసానంటున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ను 2026 నాటికి పూర్తి చేస్తామని, అదేవిధంగా ప్రాజెక్టును 2026అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నదుల అనుసంధానం జరగాల్సి ఉందని, ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయి.. వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని సీయం అన్నారు. మంచి చేసే వారితో పాటు చెడు చేసేవారిని గుర్తుంచుకోవాలని, వైసీపీ వారు ప్రాజెక్టునువిధ్వంసం చేసారని.చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందన్నారు. 2019తరువాత కూడా టీడీపీ అధికారంలో ఉంటే 2021నాటికు ప్రాజెక్టు పూర్తయ్యేదని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి , రాక్షసత్వానికి ప్రాజెక్టు బలయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
