NTV Telugu Site icon

Nominated Posts: నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌.. వారికే అవకాశం..!

Cbn

Cbn

Nominated Posts: ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రస్తుతం పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎవరికి ఏ పదవులు వస్తాయి పార్టీకి కష్టపడినా వాళ్లకు పదవులు వస్తాయా లేదా అనే చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నారు.. ఎవరెవరికి నామినేటెడ్ పదవులు.. ఇవ్వాలి… కార్యకర్తలు ఎవరు పార్టీకోసం సీరియస్ గా వర్క్ చేశారు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నేతలు ఎవరున్నారు.. వీళ్లు అందరి జాబితా కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు.. ఇప్పటికే ఎమ్మెల్యేలు కొన్ని పేర్లను పంపించారు.. మరి కొంతమంది ఎమ్మెల్యేలు పంపించాల్సి ఉంది.. ఎమ్మెల్యేలు కూడా వెంటనే జాబితా పంపించాలని ముఖ్యమంత్రి చెప్తూనే ఉన్నారు. అయితే, ఇప్పటికే 47 మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రకటించింది టీడీపీ.. ఇందులో జనసేన కు సంబంధించి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి.. త్వరలో మరికొన్ని పదవులు భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతోంది..

Read Also: Myanmar Earthquake: మయన్మార్ భూకంపం ‘‘334 అణు బాంబులకు’’ సమానం..

రాష్ట్రస్థాయిలో దేవాలయాలు పాలక మండళ్లు మరి కొన్ని కీలక సంస్థలకు చైర్మన్ల భర్తీ జరగనుంది. అదే విధంగా ఇతర పదవులకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.. కూటమిలో ఉన్న పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.. ఆ మూడు పార్టీల నుంచి కీలకంగా ఉన్న వారికి నామినేటెడ్ పదవులు రానున్నాయి.. ఆల్రెడీ.. జనసేన బీజేపీ ఇప్పటికే కొన్ని పేర్లు ఇచ్చింది.. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొంచెం భారీ స్థాయిలో పదవులు ఇవ్వనుంది. ఈ రెండు పార్టీలు ఇచ్చిన అభ్యర్థులను దృష్టి లో పెట్టుకుని టీడీపీ రెండో దఫా నామినేటెడ్ పోస్టుల ప్రకటన చేయనుంది.. త్వరలోనే ఇంకో దాఫా ప్రకటనకు సిద్ధమవుతోంది.. ఇప్పటికే ప్రకటించిన 47 మార్కెట్ కమిటీల్లో సభ్యులు కూడా ఉన్నారు. వీటితోపాటు రాష్ట్రస్థాయి దేవాలయాలు పాలక మండళ్లు, చైర్మన్ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లు… ఇవన్నీ కూడా త్వరలోనే నామినేట్ కానున్నాయి.

Read Also: Kishan Reddy : స్థానిక సంస్థలు బలపడాలంటే బీజేపీ గెలవాలి

నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు కొద్దిగా సీరియస్ గానే ఉన్నారట.. ఎందుకంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు గనుక ఎమ్మెల్యే సిఫార్సు చేస్తే వాటిని వెంటనే పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. టీడీపీతో ఉండి టీడీపీ నమ్ముకుని ఉన్నవాళ్ళకే పదవులు ఇచ్చేలాగా ఎమ్మెల్యేలు పేర్లు పంపించాలని చెప్పడం జరిగింది.. అంతేగాని నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వాళ్లు లేదా ఇతర పార్టీలతో రాసుకుని తిరిగిన వాళ్లకి దూరంగా పెట్టాలని కూడా చంద్రబాబు చెప్పారు.. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు పేర్లు పంపడానికి కొంచెం ఆలస్యం అయినప్పటికీ.. ఆచి తూచి పంపిస్తున్నారు.. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లను ప్రకటించారు.. ఇక రెండో దఫాలో దేవాలయాల పాలకమండళ్లు.. రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి ప్రకటన జరగనుంది.. బహుశా వచ్చేవారం ఈ ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..