CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ సమావేశంలో 10 అంశాలపై కీలకంగా చర్చించారు. పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది. జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆర్‌ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను ప్రశ్నించారు సీఎం… ప్రతీ ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ చెబుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. బ్యూరోక్రసీ ఆలస్యం కావడం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.
Read Also: Amaravati Capital: రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ విరాళం
మరోవైపు.. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు.. బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నింటినీ అరికాడతామని స్పష్టం చేశారు.. కాకినాడ పోర్ట్ ను బలవంతంగా లాక్కొనారు.. కాకినాడ సెజ్ కూడా లాగేసుకున్నారు.. పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాక్కొన్నారని ఆరోపించారు.. ఆస్తులను లాగసుకోవడం రాష్ట్రంలో కొత్త ట్రెండ్… ఇంతకు ముందు మనం ఎప్పుడూ చూడలేదన్నారు సీఎం.. వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారు.. ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నాం.. పథకాలు మీద అభిప్రాయ సేకరణ చేయిస్తున్నాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..