Site icon NTV Telugu

CM Chandrababu: సీఆర్డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వారిని ఇబ్బంది పెట్టొద్దు..!

Cbn

Cbn

CM Chandrababu: రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రతి 15 రోజులకు రాజధాని పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.. కొన్ని సంస్థలు.. వర్క్ ఫోర్స్.. మెషినరీ.. పూర్తి స్థాయిలో కేటాయించలేదన్నారు.. ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగు పరుచుకోవలని సూచించారు.. ఇక, రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజధాని రైతులతో సమావేశం అవ్వనున్నట్టు వెల్లడించారు.. రాజధాని రైతులతో త్వరలో సమావేశం అవుతా.. రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాన్‌తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

కాగా, గతంలో అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ప్రారంభించిన సమయంలో రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని గుర్తు చేసిన విషయం విదితమే.. ఇక, రాజధాని రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు.. వాటి రిజిస్ట్రేషన్‌ విషయంలో.. కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై ఇష్టమైన రీతిలో పోస్టులు పెడుతున్నారని.. ఈ మధ్యే మంత్రి నారాయణ మండిపడ్డారు.. రైతులకు న్యాయం చేస్తామని.. వీలైనంత త్వరలో వారికి రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తాం మని మంత్రి నారాయణ స్పష్టం చేసిన విషయం విదితమే..

Exit mobile version