Site icon NTV Telugu

CM Chandrababu Serious: కామినేని, బాలకృష్ణ ఎపిసోడ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్‌..!

Cbn

Cbn

CM Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్‌ టాపిక్‌గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యా్ణ్ వర్సెస్‌ బోండా ఉమగా మారిపోయింది.. తాజాగా, కామినేని శ్రీనివాస్‌ ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణం అయ్యాయి.. అయితే, అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం.. పార్టీ సీనియర్ నేతలు.. కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు.. ఎమ్మెల్యేలు కొందరు కావాలనే టార్గెట్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట.. బోండా ఉమా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట చంద్రబాబు..

Read Also: Hyderabad Floods: జలదిగ్బంధంలో హైదరాబాద్.. ఇళ్లు ఖాళీ చేస్తున్న మూసీ పరివాహక ప్రజలు..

అసలు సభ ఎలా జరుగుతోంది.. అనే అంశంపై దృష్టి పెట్టాలి కదా? అని చీఫ్ విప్‌తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆడిగినట్టు సమాచారం.. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్‌కు సంబంధించి సీఎం సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారట.. కొంతమంది అధికారుల బదిలీల విషయాల్లో సభలో ప్రస్తావనపై కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో సినీ సెలబ్రిటీలు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సందర్భంపై కామినేని శ్రీనివాస్‌ మాట్లాడగా.. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.. కామినేని వర్సెస్ బాలయ్యగా ఈ ఎపిసోడ్‌ ఉన్నా.. మధ్యలో వైఎస్‌ జగన్‌, మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తావన రావడంతో.. చివరకు చిరంజీవి కూడా దీనిపై స్పందించిన విషయం విదితమే..

Exit mobile version