Site icon NTV Telugu

CM Chandrababu: స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యం.. డ్వాక్రా మహిళలకు బాధ్యత..

Babu

Babu

CM Chandrababu: వ్యర్ధాల సమర్ధ నిర్వహణతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వచ్ఛంగా మలిచేలా కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రతీరోజూ ఇళ్ల నుంచి చెత్తను సేకరించి తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చేలా, పొడి చెత్తను ఏజెన్సీలకు అప్పగించేలా చూడాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏజెన్సీలను ఆహ్వానించేందుకు వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే తడి చెత్తను ఎక్కడికక్కడ ఎరువుగా మార్చేలా డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు.

Read Also: Miss world 2025: యాదాద్రి, పోచంపల్లి సందర్శించిన అందాల భామలు

స్వచ్చాంధ్ర.. సర్క్యులర్ ఎకానమీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ప్రతి మండల హెడ్ క్వార్టర్‌లోనూ, అలాగే జిల్లాకు రెండు చొప్పున రాష్ట్రంలో మొత్తం 52 క్లస్టర్లు ఏర్పాటు చేసి.. చెత్తను గ్రేడింగ్ చేసి దానిని కావాల్సిన ఏజెన్సీలకు విక్రయించడమో, లేదా అక్కడ నుంచి చెత్తను తరలించడమో చేయాలన్నారు సీఎం చంద్రబాబు.. ఏ పంచాయతీలోనూ చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేయడానికి వీల్లేదని చెప్పారు. వ్యర్ధాల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించిన పంచాయతీలకు, వ్యక్తులకు అక్టోబర్ 2న అవార్డులు అందించాలని సూచించారు. 2026 అక్టోబర్ 2 కల్లా మొత్తం వ్యవస్థ గాడిలో పడాలన్నారు.

Read Also: CMRF: చిన్నారి వేద‌వల్లి కుటుంబానికి సీఎం ఆర్థిక చేయూత‌..

జీరో వేస్ట్ అనేది మన లక్ష్యంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు.. ప్రతి పంచాయతీలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యాలని.. స్వచ్ఛాంధ్రప్రదేశ్, కాలుష్య నియంత్రణ మండలితో కలిసి పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటు చేసి చెత్తను కలెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు… వ్యవసాయ వ్యర్ధాలతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చే వ్యర్ధాలు సర్క్యులర్ ఎకానమీకి దోహదం చేసేలా అధ్యయనం జరగాలని సీఎం సూచించారు.. ‘సర్క్యులర్ ఎకానమీ పాలసీ’ రూపొందించాలని.. సర్క్యులర్ ఎకానమీలో ముందున్న రాజస్థాన్‌ మోడల్‌ను పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు.. మరోవైపు, నెల్లూరు, రాజమండ్రి, కడప, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version