Site icon NTV Telugu

CM Chandrababu: ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో పనిచేయాలి.. సీఎం కీలక ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ప్రజలే ఫస్ట్… అనే నినాదంతో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఆధారంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు.. పథకాల లబ్దిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా.. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు సీఎం.. వాట్సాప్‌ గవర్నెన్స్ లో భాగంగా ఆర్టిజిస్ పనితీరు.. అందించాల్సిన సేవలపై చర్చించారు.. వివిధ రకాల సర్టిఫికెట్లు వాట్సాప్‌ నుంచి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నర విషయం విదితమే..

Read Also: Tollywood : కొత్త ఏడాదిలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న కన్నడ కస్తూరీలు

కీలక అంశాలు..
* ఐవీఆర్ఎస్ తో పాటు వివిధ రూపాల్లో నేరుగా లబ్దిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రివ్యూ
* పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరణ
* గ్రామ స్ధాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్ బ్యాక్ పైనా అధికారుల నివేదిక
* ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలంటున్న సీఎం చంద్రబాబు
* 7 శాఖల్లో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారుల ప్రజెంటేషన్
* ప్రజల సంతృప్తి అంశంలో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు..

Exit mobile version