Site icon NTV Telugu

CM Chandrababu: షాకింగ్‌..! ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు..

Cbn

Cbn

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న వారికి షాకింగ్‌ లాంటి న్యూస్‌ చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటించారు.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు హాజరయ్యారు.. ఏడాది సంక్షేమంపై సమీక్ష… అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.. మరోవైపు, జనాభా పెరగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.. యూపీ, బీహార్‌లో జనాభా బాగా పెరుగుతోంది.. యూపీ, బీహార్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదన్నారు.. పిల్లలు భారం కాకూడదు.. వారిని ఆస్తిగా పరిగణించాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటన చేశారు..

Read Also: Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

సుపరిపాలన లో తొలి అడుగు సమావేశం లో ఏడాది పాలన పై చర్చించు కుంటున్నాం.. సూపర్ సిక్స్ లో ఎన్నికల హామీలు ఇచ్చాం అన్నారు సీఎం చంద్రబాబు.. ప్రజలకు అనేక రకాల కోరికలు ఉంటాయి. ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలన్నారు.. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక వ్యవస్థను చక్క బెట్టే ప్రయత్నం చేస్తున్నాం.. అన్ని చేశామని చెప్పడం లేదు… కానీ, ఊహించిన దాని కన్నా ఎక్కువ చేసాం. ఇంకా క్లిష్టమైన సమయంలో కూడా నేను సీఎం అయ్యాను.. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు బస్సులో కూర్చుని పరిపాలన చేసాను. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభం అయింది.. అనేది ఇవాళ వివరించు కోవాలి.. ఓటు విభజన జరగడానికి వీల్లేదని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేసాయి. మూడు పార్టీలు ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెల్లుతున్నాం అని వెల్లడించారు.. సుపరిపాలన పై అధికార యంత్రాగం దృష్టి పెట్టాలి.. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో నమ్మకం లేకుండా చేసింది. లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టించిందని ఫైర్‌ అయ్యారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version