NTV Telugu Site icon

CM Chandrababu: నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట..

Tdp Babu

Tdp Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది.. వివిధ కార్పొరేషన్లకు చైర్‌పర్సన్లను నియమించింది.. ఒకేసారి మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు భర్తీ చేసింది.. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. పొత్తుల్లో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నామినేటెడ్‌ పోస్టుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్‌ పోస్టులు దక్కాయి.. అయితే, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసింది టీడీపీ..

Read Also: Uttam Kumar Reddy: నిర్లక్ష్యం వహిస్తే సహించం.. అధికారులపై ఉత్తమ్ కుమార్ ఫైర్..

99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది.. 11 మంది క్లస్టర్ ఇంఛార్జీలకు పదవులు. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి. ఆరుగురికి యూనిట్ ఇంఛార్జీలకు పదవులు. 20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషనుకు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇక, ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం కల్పించారు.. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. మిత్రపక్షాలకు నాలుగు ఛైర్మన్ పదవులు, వివిధ కార్పోరేషన్లల్లో డైరెక్టర్లుగా నియమించారు.. బీజేపీకి కీలకమైన 20 సూత్రాల అమలు పథకం దక్కింది.. మరోవైపు.. త్యాగధనులు, యువగళం టీం, సీన్సియర్ కేడర్‌కు ప్రయార్టీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. త్యాగరాజుల కోటాలో మంతెన రామరాజు, కొనకళ్ల, పీలా గోవింద్, అబ్దుల్ అజీజ్, కర్రోతు బంగార్రాజు, బురగం శ్రీనివాసులు, పీతల సుజాతకు పదవులు దక్కగా.. యువగళం టీం కోటాలో అనిమిని రవి నాయుడు, దామచర్ల సత్యకు పదవులు కట్టబెట్టారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.