CM Chandrababu: సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ముందుగానే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మీడియాతో చిట్ చాట్‌లో ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాక్షించారు.. ఇక, పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి అని సూచించారు.. నేను అందుకే మా ఊరికి ప్రతీ సంక్రాంతికి వెళ్తున్నాను అన్నారు.. సమాజంలో పై స్థాయిలో ఉన్నవారు దీనిని పాటిస్తే, మిగిలిన వారికి అది ప్రేరణ అవుతుందన్నారు.. నేను మా ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణం.. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమo తప్పకుండా పాటిస్తున్నాం అని గుర్తుచేసుకున్నారు..
Read Also: RK Roja: తప్పించుకునే ప్రయత్నం.. చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిపై కేసు పెట్టాలి..
మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు.. ఆ ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు.. పేదవాడికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉందన్నారు.. ఈ విధానం ప్రోత్సహించటానికే పీ4 కాన్సెప్ట్ పేపర్ ను రేపు విడుదల చేస్తాం.. దీనిపై అన్నిస్థాయిల్లో చర్చ జరిగాక అమల్లోకి తెస్తాం అన్నారు.. పీ4 విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తాం అని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..