Site icon NTV Telugu

CM Chandrababu and Kishan Reddy: చంద్రబాబుతో కిషన్‌రెడ్డి లంచ్‌ మీటింగ్.. తాజా రాజకీయాలపై చర్చ

Cbn Kishan Reddy

Cbn Kishan Reddy

CM Chandrababu and Kishan Reddy: విజయవాడ పర్యటకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్‌ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు.. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు కిషన్‌ రెడ్డి..

Read Also: Austria school shooting: ఆస్ట్రియా స్కూల్‌లో ఉన్మాది కాల్పులు.. 8 మంది మృతి..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ వచ్చినందుకు సీఎం చంద్రబాబు లంచ్ కి పిలిచారని తెలిపారు.. కేంద్ర సహాయం, ఏపీకి రావాల్సిన ప్రాజెక్ట్ లపై చర్చించామని వెల్లడించారు.. ఇక, విజయవాడ పర్యటనకు వచ్చినందుకు మర్యాద పూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు పిలిచారని తెలిపారు.. మైనింగ్, ఇతర ప్రాజెక్ట్ లపై ఈ లంచ్‌ సమావేశంలో చర్చించమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వాటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు.. తెలంగాణ రాజకీయాలపై కొద్దిసేపు చర్చించినట్టు సమాచారం..

Read Also: SSC CGL 2025: డిగ్రీ అర్హతతో 14,582 సెంట్రల్ జాబ్స్.. అస్సలు వదలొద్దు

ఇక, విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. “మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధి ” కార్యక్రమాలపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇంకా బీజేపీ నేతలు దేశ అభివృద్ధికి మోడీ పాలన ఎంత కీలకమైందో వివరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. పేద, అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా మోడీ పాలన ఉండిందని అన్నారు. రైతులు, యువత, మహిళలు ఈ నాలుగు ప్రధాన విభాగాల అభివృద్ధి కోసమే ప్రతి కార్యక్రమం రూపకల్పన చేశారని అన్నారు. భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారిందని కిషన్ రెడ్డి తెలిపారు. పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు చేసి, జీఎస్టీ ద్వారా “వన్ నేషన్ వన్ ట్యాక్స్” లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. 2014లో 6.91 కోట్ల పన్నులు కట్టే వారు ఉండగా, ఇప్పుడు 15.66 కోట్లకు పెరిగిందని వివరించారు.

Exit mobile version