Site icon NTV Telugu

CM Chandrababu: రేపు ఏపీ సీఎం హస్తిన బాట.. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ

Babu Modi

Babu Modi

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతోఉన్నారు.. హస్తిన వెళ్లనున్న సీఎం చంద్రబాబు దంపతులు. రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానితో భేటీకాబోతున్నారు.. మే 2వ తేదీన ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న విషయం విదితే.. ఈ పర్యటనలో అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ.. ఇక, ప్రధానిని ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. కాగా, ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే ఏర్పాట్లపై ఫోకస్‌ పెట్టింది.. అమరావతిలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం..

Read Also: Tilak Varma: ముంబై ఇండియన్స్‌లో ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు!

కాగా, మే 2 తేదీన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు.. ప్రధాని చేతుల మీదగా లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేయాలని భావిస్తోంది కూటమి సర్కార్‌.. 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు హాజరవుతారన్నారు. నేషనల్ హైవేకు కనెక్ట్ చేసే రోడ్లు గుర్తింపు, 11 పార్కింగ్ ప్లేస్​లు గుర్తించామన్నారు. 8 రోడ్లు ద్వారా బహిరంగ సభ వేదికకు చేరుకోవచ్చని మంత్రి నారాయణ తెలిపారు.. సభాప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తామని, ఒక వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు ఉంటారని తెలిపారు.. హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు 1.1 కిలో మీటర్ల మేర ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌ షో కొనసాగనుంది..

Exit mobile version