Free Bus Scheme in AP: ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఆయా ప్రభుత్వాలు.. దీనిపై విపక్షాలు కొన్ని విమర్శలు చేసినా.. ఉచిత బస్సు ప్రయాణంతో.. బస్సుల్లో మహిళల రద్దీ మాత్రం పెరిగిపోయింది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వైపు అడుగులు పడుతున్నాయి.. దీనిపై ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా నేడు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రవాణా శాఖలో పలు అంశాలపై ఈ రోజు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: Delhi Court: వ్యక్తిపై నకిలీ అత్యాచార కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఏం చెప్పిందంటే..?
మహిళలకు ఫ్రీ బస్సు దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో ఫ్రీ బస్సుల అమలును అధ్యయనం చేసే దిశగా నిర్ణయించే అవకాశం ఉంది. అధ్యయనం అనంతరం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులలో 15 లక్షల వరకూ మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయణానికి నెలకు రూ. 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25 శాతం వరకూ కార్పొరేషన్ కు వదిలేయాలి.. మరో రూ. 125 కోట్ల వరకూ నెలకు ఆర్టీసీకే ప్రభుత్వం రీఎంబర్సుమెంటు ఇవ్వాల్సి ఉంటుంది.. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇవాళ్టి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలో మహిళలకు ఉచిత బస్సుపై చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.