Free Sand Scheme: ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.. ఆన్‌లైన్ లేదా గ్రామవార్దు సచివాలయం నుంచి ఇసుక బుకింగ్ చేసుకునేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు.. ఇసుక ఎప్పుడు సరఫరా చేస్తామో కూడా వినియోగదారులకు చెప్పేలా వ్యవస్థ ఉండాలన్న సీఎం. దళారులు, మధ్యవర్తులు కాకుండా సాధారణ ప్రజలకు ఇసుక చేరేలా చూడాలన్నారు..
Read Also: Double Ismart Twitter Review: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్విటర్ రివ్యూ.. పూరి ఈజ్ బ్యాక్!
ఇక, ఇసుక వినియోగంపై థర్డ్ పార్టీ అడిట్ కూడా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఇసుక రీచ్ లకు, స్టాక్ యార్డులకు వెళ్లే అవసరం రాదన్న సీఎం. అలాగే ఇసుక రీచ్ ల వద్ద రద్దీ కూడా తగ్గించవచ్చన్నారు.. ఆన్ లైన్ బుకింగ్ వల్ల రీచ్ ల వద్ద వాహనాల వెయిటింగ్ సమయం తగ్గడంతో పాటు ఇసుక రవాణా చార్జీలు కూడా తగ్గుతాయన్నారు.. ఇసుక రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ చేయాలని తద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకత పెరుగుతుందన్నారు.. ఇసుకను భారీ మొత్తంలో వినియోగించే బల్క్ కస్టమర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. బల్క్ కస్టమర్లుగా ప్రకటించుకున్న వారి వద్దకు తనిఖీ కోసం వెళ్లాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డులు, రీచ్ ల వద్ద మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన ఇసుక అందించాలని స్పష్టం చేశారు.. ఇసుక సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.