Free Sand Scheme: ఉచిత ఇసుక విధానం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
- ఇసుక సరఫరా.. నూతన ఉచిత ఇసుక విధానంపై సీఎం సమీక్ష..
- ఇసుక బుకింగ్ విధానం.. రవాణా.. సులభమైన లావాదేవీలు..
- విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష..
- వెబ్ సైట్.. యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Sand Scheme: ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.. ఆన్లైన్ లేదా గ్రామవార్దు సచివాలయం నుంచి ఇసుక బుకింగ్ చేసుకునేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు.. ఇసుక ఎప్పుడు సరఫరా చేస్తామో కూడా వినియోగదారులకు చెప్పేలా వ్యవస్థ ఉండాలన్న సీఎం. దళారులు, మధ్యవర్తులు కాకుండా సాధారణ ప్రజలకు ఇసుక చేరేలా చూడాలన్నారు..
Read Also: Double Ismart Twitter Review: ‘డబుల్ ఇస్మార్ట్’ ట్విటర్ రివ్యూ.. పూరి ఈజ్ బ్యాక్!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇక, ఇసుక వినియోగంపై థర్డ్ పార్టీ అడిట్ కూడా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఇసుక రీచ్ లకు, స్టాక్ యార్డులకు వెళ్లే అవసరం రాదన్న సీఎం. అలాగే ఇసుక రీచ్ ల వద్ద రద్దీ కూడా తగ్గించవచ్చన్నారు.. ఆన్ లైన్ బుకింగ్ వల్ల రీచ్ ల వద్ద వాహనాల వెయిటింగ్ సమయం తగ్గడంతో పాటు ఇసుక రవాణా చార్జీలు కూడా తగ్గుతాయన్నారు.. ఇసుక రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ చేయాలని తద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకత పెరుగుతుందన్నారు.. ఇసుకను భారీ మొత్తంలో వినియోగించే బల్క్ కస్టమర్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరని పేర్కొన్నారు. బల్క్ కస్టమర్లుగా ప్రకటించుకున్న వారి వద్దకు తనిఖీ కోసం వెళ్లాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డులు, రీచ్ ల వద్ద మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన ఇసుక అందించాలని స్పష్టం చేశారు.. ఇసుక సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!