NTV Telugu Site icon

CM Chandrababu: ఆ ఆలోచన విరమించండి.. జనాభా పెంపుపై దృష్టి పెట్టండి.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు..

Chandrababu

Chandrababu

CM Chandrababu: భారత్‌లో ఓవైపు డీలిమిటేషన్‌పై చర్చ సాగుతోంది.. సౌత్‌ ఇండియాకు డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాధి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్ని పార్టీలో గళం విప్పుతున్నాయి.. అయితే, ఈ సమయంలో.. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలుచేశారు.. ఐఐటీ మద్రాస్ లో “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాభా పెంపుదల పై కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశానికి సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉంది.. మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పైనే.. లేదంటే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడనుంచి ఇక్కడకు మైగ్రేషన్ పెరుగుతుందన్నారు.. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.. కానీ, ఆ ఆలోచన విరమించుకుని జనాభా పెంపుదలపై దృష్టి పెడితే మనమే ప్రపంచాన్ని శాసిస్తాం అని ఆసక్తికర కామెంట్లు చేశారు..

Read Also: PM Modi: భూకంపాలపై మోడీ ఆరా.. బ్యాంకాక్‌, మయన్మార్‌కి అండగా ఉంటామని హామీ

ఇక, ఐఐటీ చెన్నైలో తెలుగు విద్యార్ధుల జోష్ చూసి తెలుగులో మాట్లాడి వాళ్లను ఉత్తేజపరిచారు సీఎం చంద్రబాబు.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం ఇండియాదే అన్నారు.. మద్రాసు ఐఐటీలో 30-40 శాతం పైగా తెలుగు విద్యార్థులే చదువుతున్నారు.. మద్రాసు ఐఐటీ దేశంలో నెంబర్ వన్ గా ఉంది.. ఇక్కడ నుండి ఎనబై శాతం స్టార్టప్ విజయవంతం అవుతున్నాయి.. మద్రాస్ ఐఐటీ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు.. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చివేశాయి‌‌.. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు‌‌ తప్పని సరి‌‌ అన్నారుచంద్రబాబు.. జపాన్, యూరప్, చైనా జనాభా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. జనాభా తగ్గుదల వల్ల చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.. భారతదేశానికి గొప్ప వరం డెమోగ్రఫిక్ డివిడెండ్.. భారతదేశానికి అలాంటి ఇబ్బందులు లేవు మరో 40 సంవత్సరాలు మనదే అన్నారు.. 2047 నెంబర్ గా ఇండియా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..