Site icon NTV Telugu

CM Chandrababu: మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ.. ఆ శాఖలో ప్రక్షాళన జరగాల్సిందే..!

Cbn

Cbn

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్‌ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, వైద్య రంగం, రాజధాని పురోగతి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడిన సీఎం, రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది అని తెలిపారు.

Read Also: Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్

ఇక, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న చంద్రబాబు.. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం అని ప్రకటించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. పోలవరాన్ని జాతీయ గుర్తింపుతో తీర్చిదిద్దేందుకు, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. మరోవైపు,, రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం పేర్కొన్నారు. మార్కాపురం, మదనపల్లి మెడికల్‌ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీలను కూడా త్వరగా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. అయితే, రాష్ట్ర పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమని చెప్పిన సీఎం చంద్రబాబు.. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అని స్పష్టం చేశారు.. ప్రజలకు సులభ సేవలు అందేలా వ్యవస్థను మారుస్తాం అని మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..
అమరావతి:

Exit mobile version