CM Chandrababu: ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి.. సీఎం ఆదేశాలు
- ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు..
- వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలో మీటర్లకు పైగా రోడ్లు దెబ్బ తిన్నాయన్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో.. ప్రాధాన్యాతల వారీగా దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు.. వరద బాధితుల సాయంలో భాగంగా బ్యాంకర్లు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వరదలు మిగిల్చిన నష్టంపై దృష్టిసారిస్తూనే.. విజయవాడలో సహాయక చర్యలు.. మరోవైపు జరిగిన నష్టాన్ని పూడ్చే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. వేలాది వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో బీమా ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే..
Read Also: Bonthu Rammohan: కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు.. సవాల్ విసిరితేనే గాంధీ స్పందించారు
Also Read
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!