NTV Telugu Site icon

CM Chandrababu: ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి.. సీఎం ఆదేశాలు

Chandrababu

Chandrababu

CM Chandrababu: వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఆర్‌ అండ్‌ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలో మీటర్లకు పైగా రోడ్లు దెబ్బ తిన్నాయన్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. దీంతో.. ప్రాధాన్యాతల వారీగా దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా కార్యక్రమంపై రివ్యూ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లనున్నారు.. వరద బాధితుల సాయంలో భాగంగా బ్యాంకర్లు, ఇన్ స్యూరెన్స్ ఏజెన్సీల ప్రతినిధులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వరదలు మిగిల్చిన నష్టంపై దృష్టిసారిస్తూనే.. విజయవాడలో సహాయక చర్యలు.. మరోవైపు జరిగిన నష్టాన్ని పూడ్చే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. వేలాది వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో బీమా ఏజెన్సీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే..

Read Also: Bonthu Rammohan: కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు.. సవాల్ విసిరితేనే గాంధీ స్పందించారు

Show comments