NTV Telugu Site icon

Andhra Pradesh: భారీ వర్షాలు.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు..

Pensions

Pensions

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ.. తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీని చేపట్టింది ప్రభుత్వం.. ఇంటి వద్దుకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు.. అయితే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు ఉద్యోగులు.. ఇక, భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయవచ్చు అన్నారు సీఎం.. పెన్షన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని.. టార్గెట్లు పెట్టవద్దని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Read Also: Farmers Protest 200 Days: నేడు శంభు సరిహద్దులో రైతుల భారీ నిరసన.. పాల్గొన్న వినేష్ ఫోగట్

మరోవైపు.. పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది.. ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను అందజేశారు సచివాలయాల సిబ్బంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షమ్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు రూ. 2729.86 కోట్లను పంపిణీ చేయనుంది కూటమి సర్కార్‌.. ఇప్పటి వరకు 56 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టారు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. పెన్షన్ల పంపిణీలో టాప్-3లో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు నిలవగా.. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది.. జోరు వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు సచివాలయాల సిబ్బంది. రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ జరుగుతోంది. అయితే, వర్షాల నేపథ్యంలో.. సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు.