NTV Telugu Site icon

CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్‌.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి

Cbn

Cbn

CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్ పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో టూరిజం శాఖపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ.. పీపీపీ మోడ్ లో ఇన్వెస్టర్స్ ముందుకొచ్చారు.. ఈ నెల 17వ తేదీన విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను పిలుస్తున్నాం అన్నారు.. PPPలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు.. అయితే, టూరిజంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కలెక్టర్లు టూరిజంపై వాళ్ల ఆలోచనలు పంపించాలి సూచించారు.. డబ్బులు ఖర్చు పెడుతున్నారే కానీ ఫలితాలుండటం లేదన్న ఆయన.. నిధులు అర్ధవంతంగా ఖర్చుపెట్టాలి.. ఏ ఏ సమావేశాలు కలెక్టర్లు నిర్వహించాలనే అంశంపై ఒక క్యాలెండర్ సిద్ధం చేయాలన్నారు.

Read Also: Allu Arjun: ఢిల్లీకి అల్లు అర్జున్.. తిరుమల శ్రీవారి సేవలో భార్య

టూరిజంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను కూడా లింక్ చేయాలి.. దేవాలయాల నిధులు కూడా టూరిజం కు లింక్ చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు.. ఏ జిల్లాలో హోటళ్లు, టూరిజం అభివృద్ధి కావాలో వివరాలు కలెక్టర్లు తీసుకురావాలి, మేం అడగటం కాదని వ్యాఖ్యానించారు.. ఉపాధి కల్పనకు అత్యధిక అవకాశాలు వచ్చే డిపార్ట్మెంట్ టూరిజం.. పర్యాటకంతో 20 శాతం అభివృద్ధి రేటు సాధించచ్చు అన్నారు.. కడపలో ఉండే గండికోట చాలా అద్భుతంగా ఉంటుంది.. ప్రపంచంలోనే 10వ సుందర ప్రదేశంగా గండికోటను గుర్తించారని గుర్తుచేశారు. అంతేకాదు.. తిరుపతిలో పర్యాటకులు ఒక రోజు కూడా ఉండటం లేదు.. ప్రతీ జిల్లాలో సరైన మంచి హోటళ్లు లేవు.. అన్ని హోటళ్లు కలుపుకుని 50 వేల రూమ్‌లు ప్రతీ చోటా ఉండేలా చూడాలన్నారు.. టూరిజానికి లా అండ్ ఆర్డర్ చాలా అవసరం.. సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ముఖ్యం అన్నారు సీఎం.. గతంలో ఉన్న లా అండ్ ఆర్డర్ ఉంటే ఎవరూ రారన్న ఆయన.. మాటలు చెప్పడం కాదు.. రాబోయే మూడు నెలల్లో అమలు కనిపించాలని కలెక్టర్లను ఆదేశించారు.. ప్రభుత్వ భవనాలలో, ప్రైవేటు భవనాలలో కో వర్కింగ్ స్పేస్, వర్క్ స్టేషన్లు పరిశీలించండి.. ఓర్వకల్లు, కొప్పర్తి టెండర్లు పిలవండి అని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Show comments