Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu And Deputy Cm Pawan Kalyan Meet And Discussion On The Ministry To Be Allotted To Nagababu

CM and Deputy CM Meet: నాగబాబుకు ఏ శాఖ ఇద్దాం..? సీఎం, డిప్యూటీ సీఎం కీలక చర్చలు..

Published Date :December 16, 2024 , 5:47 pm
By Sudhakar Ravula
  • సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ..
  • అరంగట పాటు జరిగిన సమావేశం..
  • నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ..
CM and Deputy CM Meet: నాగబాబుకు ఏ శాఖ ఇద్దాం..? సీఎం, డిప్యూటీ సీఎం కీలక చర్చలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM and Deputy CM Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొణిదెల నాగబాబు.. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో అడుగు పెట్టడం ఖాయం అయ్యింది.. ఇప్పటికే నాగబాబుకు కేబినెట్‌ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. అయితే, ఆయనకు ఏ శాఖ ఇవ్వాలి అనేదానిపై కీలక చర్చలు సాగుతున్నాయి.. ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్‌లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..

Read Also: Ambati Rambabu: సీఎం వ్యాఖ్యలకు అంబటి కౌంటర్‌ ఎటాక్.. దీనికి బాధ్యుడు చంద్రబాబే..!

ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం 24 మంది మంత్రులున్నారు.. ఏపీ అసెంబ్లీ స్థానాల ప్రకారం 25 మందిని మంత్రి వర్గంలోకి తీసుకునే వీలు ఉన్న నేపథ్యంలో.. మిగిలిన ఆ ఒక్క మంత్రిపదవిని నాగబాబుతో భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి మేరకు నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.. అయితే, నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే జనసేన నుంచి విజయం సాధించిన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కందుల దుర్గేష్‌ దగ్గర సినిమాటోగ్రఫీ ఉంది.. దానితో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలు కూడా ఆయనే వద్దే ఉన్నాయి.. అందులో సినిమాట్రోగ్రఫీ నాగబాబుకు ఇచ్చి.. మిగతా శాఖల్లో కందుల దుర్గేష్‌ను వద్దే ఉంచుతారనే ప్రచారం కూడా సాగుతుందట.. అయితే, ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మధ్య ఎలాంటి చర్చలు సాగాయి.. ఏ శాఖ ఇవ్వాలని నిర్ణయించారు? అనేది తెలియాల్సి ఉంది.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap Cabinet
  • cm chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • Nagababu

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions