CM and Deputy CM Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొణిదెల నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో అడుగు పెట్టడం ఖాయం అయ్యింది.. ఇప్పటికే నాగబాబుకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. అయితే, ఆయనకు ఏ శాఖ ఇవ్వాలి అనేదానిపై కీలక చర్చలు సాగుతున్నాయి.. ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్‌లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..
Read Also: Ambati Rambabu: సీఎం వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఎటాక్.. దీనికి బాధ్యుడు చంద్రబాబే..!
ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం 24 మంది మంత్రులున్నారు.. ఏపీ అసెంబ్లీ స్థానాల ప్రకారం 25 మందిని మంత్రి వర్గంలోకి తీసుకునే వీలు ఉన్న నేపథ్యంలో.. మిగిలిన ఆ ఒక్క మంత్రిపదవిని నాగబాబుతో భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు నాగబాబును కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.. అయితే, నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే జనసేన నుంచి విజయం సాధించిన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కందుల దుర్గేష్ దగ్గర సినిమాటోగ్రఫీ ఉంది.. దానితో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలు కూడా ఆయనే వద్దే ఉన్నాయి.. అందులో సినిమాట్రోగ్రఫీ నాగబాబుకు ఇచ్చి.. మిగతా శాఖల్లో కందుల దుర్గేష్‌ను వద్దే ఉంచుతారనే ప్రచారం కూడా సాగుతుందట.. అయితే, ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య ఎలాంటి చర్చలు సాగాయి.. ఏ శాఖ ఇవ్వాలని నిర్ణయించారు? అనేది తెలియాల్సి ఉంది.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి..