NTV Telugu Site icon

CM Chandrababu: సినిమాల్లో ఆ ‘ఆర్ఆర్ఆర్‌’.. రాజకీయాల్లో ఈ ‘ఆర్ఆర్ఆర్‌’ సంచలనం..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇక, రఘురామకృష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సినిమా రంగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో (రఘు రామకృష్ణం రాజు) ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఓ సంచలనంగా పేర్కొన్నారు.. ఇక, డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తండ్రి ఎమ్మెల్సీగా సేవలు అందించారని గుర్తుచేశారు.. కల్మషం లేకుండా.. ముందు వెనక చూడకుండా RRR మాట్లాడతారు.. కుండ బద్దలకొట్టినట్టు మట్లాడతారు రఘురామకృష్ణం రాజు అన్నారు.. అయితే, గత ప్రభుత్వ హయాంలో సొంత ఎంపీ అయిన రఘురామ వ్యతిరేకిస్తే భయపెట్టాలని చూశారని.. రాజద్రోహం కేసు నమోదు చేశారు.. ఎలాంటి కుట్రలు, రాజద్రోహం రఘురామ చేయలేదన్నారు.. పుట్టిన రోజున అరెస్టు చేసి ఎంపీని హింసించిన ఘటన పెద్ద సంచలనం అయ్యింది.. అలాంటి ఘటన నేను చూసింది.. ఇదే మొదటి ఆఖరిదిగా చెప్పుకొచ్చారు..

Read Also: UP: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

ఇక, శుక్రవారం అయితే అరెస్టు చేసి జైల్లో పెట్టచ్చు… కోర్టు ఉండదు గనుక.. అన్నట్టుగా ఇదో స్పెషాలిటీగా వైసీపీ వాడుకుందని దుయ్యబట్టారు చంద్రబాబు.. స్ధానిక ఎంపీగా రఘురామ సొంత ఊరు కూడా వెళ్లలేకపోయిన పరిస్ధితి తెచ్చారు.. నేను జైల్లో ఎలా ఉన్నానో వాచ్ చేయడానికి సీసీ కెమెరాలు పెట్టాక.. రఘురామను కొడుతూ ఫోన్ లో చూసేలా కెమెరా పెట్టి చూశారని నమ్మాను అన్నారు.. పోరాట యోధుడుగా గెలిచి డిప్యూటీ స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న రఘురామను అభినందిస్తున్నా.. గౌరవ సభగానే అడుగు పెటతానని ఆ‌రోజు వెళ్లి.. ఇవాళ వచ్చాను.. నిన్నటి వరకు ఎలా మాట్లాడినా ఫర్లేదు.. కానీ, రఘురామ ఇకపై గౌరవంగా ఆ సీటును గుర్తుంచుకుని మాట్లాడాలని సూచించారు.. వైసీపీ హయాంలో అటెంప్టివ్ రేప్ కేసు మోపబడిన ఆయన స్పీకర్, చంపేయాలని చూసిన ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్ గా అభివర్ణించారు.. నాడు ఈ రాష్ట్రానికి మిమ్మల్ని రానీయని వాళ్లు.. సభలోకి రాలేని కూచోలేని పరిస్ధితి వచ్చింది.. అది కూడా దేవుడు రాసిన స్క్రిప్టే అన్నారు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి నిరంతరం పహారా కాస్తున్నాం.. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి.. పాశవికంగా తయారయ్యారు.. వాళ్ళంతా అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, నిజ జీవితంలో దెబ్బ పడ్డారు.. తట్టుకుని నిలబడ్డారు.. దానికి మీకు హాట్సాఫ్ అంటూ రఘురామ కృష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు..

Show comments