సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు కొత్త టీంలు ఏర్పాటు అవుతున్నాయి.. సీఎం జిల్లాల పర్యటన, నియోజకవర్గాల్లో పర్యటనలను టీంలు మానిటరింగ్ చేస్తాయి. అందుకోసం జోన్ల వారీగా అధికారుల నియామకం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో సీఎం పర్యటన ముందుగా కొంతమంది అధికారుల బృందం పరిస్థితి సమీక్ష చేస్తుంది.. జిల్లాలలో సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు, పరిపాలన, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనేది కమిటీ అంచనా వేస్తుంది. కమిటి రిపోర్ట్ తర్వాత సీఎం పర్యటన ఉండనుంది.
Read Also: Shadnagar Murder : షాద్‌నగర్ శివలీల హత్య కేసు ఛేదించిన పోలీసులు
అధికారులతో కూడిన బృందాలను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్స్ పార్టీగా 4 జోన్లకు బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ, ప్రణాళికా విభాగం, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి అధికారుల బృందాలు ఉంటాయి.. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల నుంచి కూడా బృందాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలతో సీఎం సమావేశాలకు సంబంధించి కూడా ఈ టీం కసరత్తు చేస్తుంది.
Read Also: Budget 2025 : దేశ బడ్జెట్‌ను మొదటిసారిగా ‘హిందీ’లో ఎప్పుడు ముద్రించారో తెలుసా ?
సీఎం జిల్లాల టూర్‌లకు వేదిక ఏర్పాటు, ఎక్కడ సభ ఏర్పాటు చేయాలి అనే అంశంపై కూడా ఒక టీం పని చేస్తుంది. అలాగే.. కేటరింగ్ ఏర్పాట్లు కూడా ఈ టీం నిర్వహిస్తోంది.. సీఎం జిల్లా పర్యటనలకు సంబంధించి స్థానిక నేతలతో ఇంటరాక్షన్ పై కూడా ఈ బృందాలు దృష్టి పెడతాయి. ప్రజలతో సన్నిహిత సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తెలుసుకోవడం కోసమే ఈ టీమ్స్ ప్రధానంగా ఏర్పాటు అవుతున్నాయి. జిల్లా స్థాయిలోను నియోజకవర్గంలో పరిస్థితి తెలుసుకోవడంపైన కూడా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోంది.