CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు..!

Cbn

Cbn

CBN Flight Technical Issue: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే ప్రత్యేక విమానానికి సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన సీఎం చంద్రబాబు.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు… అయితే, ఆయన ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్యలు గుర్తించారు… దీంతో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. బేగంపేట విమానాశ్రయం నుంచి మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక విమానంలో ఏసీ సమస్య
ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రయాణించే ప్రత్యేక విమానాన్ని అధికారులు తనిఖీ చేయగా సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా విమానంలోని ఏసీ వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అదే విమానంలో ప్రయాణించడం సాధ్యం కాకపోవడంతో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు హైదరాబాద్‌లో మరో ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరారు. అక్కడికి చేరుకున్న వెంటనే సిద్ధంగా ఉంచిన మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణ ప్రణాళికలో మార్పు వచ్చినప్పటికీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. కాగా, డీలిమిటేషన్‌, మహిళా బిల్లులపై కీలక చర్చల నేపథ్యంలో.. కేంద్రం నుంచి పిలుపుతో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు బయల్దేరుతున్న విషయం విదితమే..