Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu, Pawan Kalyan Meet: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్లి తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ కసరత్తు ముమ్మరం చేశాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు వెళ్లాలి, ఎవరు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి’ అనే అంశాలపై ప్రధానంగా. చర్చ జరగనుంది. మేయర్ స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ లేదా మంత్రి సత్యకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూటమి నేతల సమావేశం హాట్ టాపిక్ గా మారింది.
ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కూటమి తరఫున స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థుల ఎంపికను ఎలా చేపట్టాలి? అనే అంశాలపై చర్చ జరగనుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేయర్ స్థానాల విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఏ పార్టీకి ఏ స్థానాలు దక్కాలి అనే అంశాలపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
Also Read
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నేతలు పలు దఫాలుగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కూడా స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించి, అభ్యర్థుల ఎంపికలో ప్రజామోదం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ సమన్వయ కమిటీతో సమావేశమై క్షేత్రస్థాయి బలాబలాలపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!