CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్ నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు… రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతోపాటు.. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రొత్సహించాలని సూచించారు. దీని నిమిత్తం క్యాంపెయిన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే ఏ ప్రాంతాల్లో ఏయే పంట సాగు చేయాలనేదానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి చెప్పారు.
పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు… రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని చెప్పారు. ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరును చదివి వినిపించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనను అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మరోవైపు, రంపచోడవరంలో విద్యార్థి శివాని ఆత్మహత్య చేసుకున్న ఘటనను సీఎం చంద్రబాబు అధికారుల వద్ద ప్రస్తావించారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకో మెట్రిక్ టెస్టులను చేయించాలని విద్యా శాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతోపాటు… టీచర్లకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!