NTV Telugu Site icon

AP Aviation Corporation: ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌లో అక్రమాలపై సర్కార్‌ ఫోకస్.. ఆ లావాదేవీలపై ఆరా..

Cbn

Cbn

AP Aviation Corporation: గత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో అవినీతి జరిగింది.. అవకతవకలు జరిగాయంటూ వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. మరికొన్ని శాఖలపై కూడా దృష్టిసారించాయి.. ఇక, గత ప్రభుత్వంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అక్రమాలపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. 2019-24 మధ్య కాలంలో ఏవియేషన్ కార్పొరేషన్‌ లావాదేవీలపై ఆరా తీస్తోంది.. అప్పటి ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి అక్రమాలపై త్వరలో విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..

Read Also: Supreme Court: జార్ఖండ్ సీఎం హేమంత్ కు ఊరట..బెయిల్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు

ఏపీ ఏవియేషన్‌ కార్పొరేషన్ అప్పటి ఎండీ భరత్ రెడ్డి కేంద్రంగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వానికి కీలక సమాచారం అందిందట.. దీంతో, మాజీ సీఎం వైఎస్‌ జగన్ విదేశీ పర్యటనలు.. నిబంధనలకు విరుద్దంగా జరిగిన కార్పొరేషన్ వ్యవహారాలపై దృష్టి సారించిందట కూమటి ప్రభుత్వం.. తప్పుడు సమాచారంతో నిబంధనలకు విరుద్దంగా నిధులను డ్రా చేసినట్టు వెల్లడిఅయినట్టుగా తెలుస్తోంది. ఏడాదికి రూ. 3 కోట్ల చొప్పున కర్నూలు ఎయిర్ పోర్టు మెయిన్టెన్సు కాంట్రాక్టును భరత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని అభియోగాలు ఉన్నాయి.. భరత్ రెడ్డి కేంద్రంగానే ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో కూడా భారీగా అక్రమాలు జరిగాయని భావిస్తోంది ప్రభుత్వం. మరోవైపు.. 2014-19 కాలంలో కేసీఆర్ హయాంలో తెలంగాణ ఏవియేషన్ కార్పొరేషన్‌లో జేఎండీగా భరత్ రెడ్డి పనిచేశారు..