Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram-Banakacherla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (PBLP)కు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈ విషయాన్ని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ToR ప్రతిపాదన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు అందింది. ఈ ప్రతిపాదనను జూన్ 17న నిపుణుల మదింపు కమిటీ (EAC) పరిశీలించింది. అయితే ప్రాజెక్టుకు పర్యావరణ మదింపు కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపొందించే ముందు కేంద్ర జల సంఘం (CWC) అంతరాష్ట్ర జల వివాదాలు, అవసరమైన అనుమతులు, సాంకేతిక అంశాలను పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. అదే సమయంలో, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జలాల ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందంటూ పలు ఫిర్యాదులు కూడా కేంద్రానికి అందినట్లు మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిపుణుల మదింపు కమిటీ చేసిన సిఫారసుల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన ToR ప్రతిపాదనను వెనక్కి పంపినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
తాజావార్తలు
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!