IAS Officers: ఏపీ, తెలంగాణ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను ఏపీలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను మోడీ సర్కార్ తోసిపుచ్చింది. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి, చేవూరి హరి కిరణ్ లను సైతం రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16లోగా తెలంగాణలో రిపోర్టు చేయాలని తెలిపింది.
Read Also: Archana Kochchar: ఫ్యాషన్ షోలో తుళ్లిపడ్డ అర్చన కొచ్చర్.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!
అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేసింది. అయితే, వారిలో కొంత మంది మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను ఏపీ కేడర్‌కు మార్చాలని వేడుకున్నారు. ఇదే విషయంపై గతంలో క్యాట్‌ను కూడా పలువురు ఐఏఎస్ అధికారులు ఆశ్రయించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన క్యాట్.. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిల్ ఫైల్ చేసింది. కాగా, గత మార్చి నెలలో దీనిపై ఎంక్వైరీ చేసిన తెలంగాణ హైకోర్టు.. అభ్యర్థనలను మరోసారి పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.