NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌.. సాస్కి 2024-25 తొలి విడత నిధులు విడుదల

Kandula Durgesh

Kandula Durgesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. “సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)”ద్వారా తొలి విడత నిధులు విడుదల చేసింది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ కార్యాలయం.. ఏపీలో పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం.. మంత్రి కందుల దుర్గేష్ కృషితో, ప్రత్యేక చొరవతో కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయని.. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన “సాస్కి-2024-25 (Special Assistance to States for Capital Investment)”ద్వారా తొలి విడతగా 113.751 కోట్లు (66 శాతం) విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.. తొలి విడత నిధుల్లో 75 శాతం వినియోగించాక తదుపరి విడత నిధులు (34 శాతం) విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తెలిపారు.

Read Also: IPL 2025 Captains: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఏ జట్టుకు ఎవరు కెప్టెన్‌గా ఉండబోతున్నారంటే?

ఇక, సాస్కి నిధులతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్) సమర్పించామని పేర్కొన్నారు.. పర్యాటకాంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి కందుల.. భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు నిజం చేస్తూ త్వరితగతిన నిధుల విడుదలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు..

Read Also: Sanjay Raut: ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే విఫలం.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి..

ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై పర్యాటక శాఖ, దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల మంత్రులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగిందని, అనంతరం ఢిల్లీలో డిప్యూటీ సీఎం పర్యటించి త్వరితగతిన నిధులు విడుదలకు చొరవ చూపించడంపై కృతజ్ఞతలు తెలిపారు కందుల దుర్గేష్.. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామన్నారు.. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని సెప్టెంబర్ లో బెంగుళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో ఇచ్చిన హామీని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిలుపుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇక, రాష్ట్ర పర్యాటక రంగంపై మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధతో, పర్యాటక శాఖ అధికారుల సమిష్టి కృషితో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని.. ఆ ప్రకటనలో పేర్కొన్నారు.