NTV Telugu Site icon

East Godavari: కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు

Road

Road

East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అంటేనే చెమటలు పడతాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు వెళ్లే వారికి ఈ కెనాల్‌ రోడ్డే దిక్కు. ఇది పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రతిరోజు యాక్సిడెంట్లు సాధారణం అయిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో బయటపడ్డవారికి లెక్కలే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కీలకమైన ఈ కెనాల్ రోడ్డుకు మాత్రం మోక్షం దక్కలేదు. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం చేస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం వస్తుంది. దానివలన రాకపోకలు కూడా సులభతరం అవుతాయి. ఈ కీలకమైన ప్రాజెక్టు దశాబ్దాలుగా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది.

Read Also: Allu Arjun : ‘చిక్కు బాబాయ్‌’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్

తాజాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఈ 62 కిలోమీటర్లు కెనాల్ రోడ్డును హైవేగా మారుస్తూ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు పంపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటికే కాకినాడ పోర్టుకి రెండు రోడ్లు ఉండగా మూడో ప్రత్యామ్నాయ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల సామర్లకోట – రాజమండ్రి మధ్య ఉన్న టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైవే కి సంబంధించి భూ సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లడానికి ఏడీబీ రోడ్డు ఉంది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా కెనాల్ రోడ్డు కూడా వినియోగంలో ఉంది. 2016లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదు. అంచనా వ్యయం కూడా అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా మార్చేందుకు రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లడంతో వెంటనే అనుమతులు లభించాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి యఅఇతే కాకినాడ – రాజమండ్రి మధ్య రవాణాతో పాటు ఇతర రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.