Site icon NTV Telugu

Land Allocation in Amaravati: అమరావతిలో ఏ సంస్థకు ఎంత భూమి..? తేల్చనున్న కేబినెట్‌ సబ్‌కమిటీ

Amaravati

Amaravati

Land Allocation in Amaravati: రాజధాని అమరావతి రీలాంచ్‌ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది.. రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఇక, రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించే భూముల విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్‌ సబ్‌ కమిటీ.. పలు భూ కేటాయింపులపై ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు ఇచ్చే భూముల కేటాయింపు పై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. అమరావతి పనులు మరింత ముమ్మరంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వివిధ సంస్థలకు ఇవ్వాల్సిన భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఏపీ సర్కార్.. మంత్రివర్గ ఉప సంఘంలో భూ కేటాయింపులపై తీసుకున్న నిర్ణయాలపై ఎల్లుండి జరిగే కేబినెట్‌ సమావేశంలో చర్చించి.. వాటికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది..

Read Also: Ram Charan : రామ్ చరణ్ కి అరుదైన గౌరవం.. లండన్ బయలుదేరిన మెగా ఫ్యామిలీ!

Exit mobile version